Nalgonda: నల్లగొండ జిల్లాలో జోరుగా నకిలీ గోల్డ్ ఫ్లేక్ విక్రయాలు
Nalgonda: నల్లగొండ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ల విక్రయాలు. నాసిరకం పొగాకుతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.
Nalgonda: నల్లగొండ జిల్లాలో జోరుగా నకిలీ గోల్డ్ ఫ్లేక్ విక్రయాలు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నకిలీ సిగరెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ ‘గోల్డ్ ఫ్లేక్’ పేరుతో నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయని ధూమపాన ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యత లేని నిషిద్ధ పొగాకుతో రూపొందించిన ఈ ప్యాకెట్లను అసలు బ్రాండ్‌ను పోలి ఉండేలా ముద్రించి, అధిక మార్జిన్లకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని విక్రేతలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని, నాసిరకం పొగాకు వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదముందని బాధితులు వాపోతున్నారు.
ఈ కల్తీ మాయాజాలం వెనుక ఉన్న సూత్రధారులపై అధికారులు తక్షణమే దర్యాప్తు జరిపి, సరఫరాదారులు మరియు విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




