Nalgonda: నోటీసులు లేకుండా డబ్బాల తొలగింపు దారుణం మాజీ కౌన్సిలర్!
Nalgonda: నల్గొండ హైదరాబాద్ రోడ్డులో చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించడంపై మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.
Nalgonda: నోటీసులు లేకుండా డబ్బాల తొలగింపు దారుణం మాజీ కౌన్సిలర్!
Nalgonda: నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డుపై ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారుల డబ్బాలను మున్సిపల్ అధికారులు జేసీబీలతో దౌర్జన్యంగా తొలగించడం దారుణమని మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పూలు, పండ్లు విక్రయించుకుంటూ జీవిస్తున్న స్ట్రీట్ వెండర్లపై అధికారులు ప్రతాపం చూపడం సమంజసం కాదన్నారు.
కనీసం ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండా డబ్బాలను తొలగించడం వల్ల ఆ నిరుపేద కుటుంబాలు వీధిపాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బాలు తొలగించాల్సి వస్తే, ముందుగా వారికి వేరే చోట ప్రత్యామ్నాయ స్థలం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పట్టణాభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని, లేకుంటే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పేదల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.




