Ghattuppal: గట్టుప్పలలో ఘనంగా ఇ.ఎల్.వి. భాస్కర్ జన్మదిన వేడుకలు

Ghattuppal: నల్గొండ జిల్లా గట్టుప్పలలో ఘనంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ జన్మదినం. విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ, ఉపాధి కల్పనపై కీలక ప్రకటనలు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 18 Aug 2026 6:44 PM IST
Ghattuppal
X

Ghattuppal: గట్టుప్పలలో ఘనంగా ఇ.ఎల్.వి. భాస్కర్ జన్మదిన వేడుకలు

గట్టుప్పల: నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.సేవాయే లక్ష్యంగా ఆయన చేసిన కీలక ప్రకటనలు అందరినీ ఆకట్టుకున్నాయి.​

దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. చదువుకు రవాణా సమస్య అడ్డురాకూడదని స్పష్టం చేశారు. అలాగే, రైతుల చిరకాల స్వప్నమైన శివన్నగూడెం ప్రాజెక్టుకు రెండేళ్లలోపు నాగార్జునసాగర్ నీరు తెస్తానని హామీనిచ్చారు.

​నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఇకపై ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని, వచ్చే నెలలోనే తొలి ఉద్యోగ మేళా ఉంటుందని ప్రకటించడంతో యువత హర్షం వ్యక్తం చేసింది. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story