Nalgonda: ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీఎస్పీ
Nalgonda: ట్రాన్స్‌జెండర్లు చట్టాన్ని గౌరవిస్తూ గౌరవప్రదంగా జీవించాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.
Nalgonda: ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీఎస్పీ
నల్గొండ: ట్రాన్స్‌జెండర్లు చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి సూచించారు. నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, శుభకార్యాల వద్ద బలవంతపు వసూళ్లకు దిగడం, ప్రజలను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలన్నారు. ఫిర్యాదులు వస్తే పరిశీలించి కేసులు నమోదు చేస్తామన్నారు.
అలాగే ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భయపడకుండా పోలీసులను సంప్రదిస్తే తగిన సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.




