Nalgonda: నల్లగొండ అమానుషం.. కన్నతల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకు!
Nalgonda: నల్లగొండ జిల్లా నారాయణపురంలో కొడుకు, కోడలు వేధించి ఇంట్లోంచి గెంటెసిన 85 ఏళ్ల వృద్ధురాలు రామనర్సమ్మకు కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో అధికారులు అండగా నిలిచారు
Nalgonda: నల్లగొండ అమానుషం.. కన్నతల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకు!
Nalgonda: కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కసాయిలా మారిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది. మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు నెమలి రామనర్సమ్మను ఆమె పెద్ద కొడుకు లింగారెడ్డి, కోడలు యాదమ్మలు దారుణంగా వేధింపులకు గురిచేశారు.
ఇంట ఉన్న బంగారం,రూ. 30 వేల నగదు లాక్కుని, ఆమెను కొట్టి బలవంతంగా ఇంట్లోంచి వెళ్లగొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.న్యాయం చేయాలని కోరుతూ రామనర్సమ్మ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లను కలసి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి పరిస్థితిపై తక్షణమే స్పందించిన అధికారులు, మిర్యాలగూడ డిఎస్పీ రవిని గ్రామానికి పంపించారు.స్వయంగా నారాయణపురం చేరుకున్న డిఎస్పీ రవి, వృద్ధురాలికి 25 కేజీల బియ్యం, పండ్లు అందించి ఆమె బాధలను విన్నారు.
రామనర్సమ్మ పెద్ద కొడుకు లింగారెడ్డి, రెండో కొడుకు యాదగిరి రెడ్డిలను స్టేషన్‌కు పిలిపించి విచారణ జరపాలని మాడుగులపల్లి ఎస్ఐ సురేష్ యాదవ్‌ను ఆదేశించారు.
మరోవైపు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వికలాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారి నాగిరెడ్డి కూడా వృద్ధురాలితో మాట్లాడారు.ఇద్దరు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని, మాట వినకపోతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు...




