Nalgonda: రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి!
Nalgonda: రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: నల్గొండ కలెక్టర్‌కు ధర్మ సమాజ్ పార్టీ (DSP) వినతి.
Nalgonda: రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి!
Nalgonda: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల నెపంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపకుండా తక్షణమే తిరిగి ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని కోరారు.
Next Story




