Nalgonda: రాహుల్ గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా నల్గొండలో డీసీసీ ర్యాలీ
Nalgonda: రాహుల్ గాంధీపై అక్రమ కేసులను నిరసిస్తూ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్లరిబ్బన్ల నిరసన ర్యాలీ.
Nalgonda: రాహుల్ గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా నల్గొండలో డీసీసీ ర్యాలీ
Nalgonda: ఏఐసీసీ నాయకుడు రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో నల్లరిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మాట్లాడారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా-ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా, రాహుల్‌గాంధీపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయడం అరాచకానికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్‌గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Next Story




