Nalgonda: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది
Nalgonda: నల్లగొండలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు. సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ నేత పల్లా దేవేందర్ రెడ్డి విమర్శ.
Nalgonda: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది
నల్గొండ: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నైజాం నవాబును తరిమికొట్టి ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.
ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల' సందర్భంగా సిపిఐ నల్గొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోరాట యోధులకు, అమరులకు ఘనంగా నివాళులర్పించారు.




