Nalgonda: జీజీహెచ్‌లో శిశువు మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం
Nalgonda: నల్గొండ జీజీహెచ్‌లో గర్భస్థ శిశువు మృతి చెందడంపై సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలపై కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు.
Nalgonda: జీజీహెచ్‌లో శిశువు మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం
నల్గొండ: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH)లో గర్భస్థ శిశువు మృతి చెందడంపై సోషల్ మీడియాలో ప్రచారమైన కథనాలపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఈ నెల 27న మధ్యాహ్నం 12:55 గంటలకు కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు.27 మధ్యాహ్నం, రాత్రితో పాటు 28 ఉదయం వరకు జరిపిన పరీక్షల్లో శిశువు గుండెచప్పుడు సాధారణంగానే ఉన్నట్లు,తల్లి ఆరోగ్యం కూడా స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.28 ఉదయం 6:15 గంటలకు శిశువు కదలికలు తగ్గడంతో లేబర్ రూమ్‌కు తరలించి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా గుండెచప్పుడు నిలిచిపోయినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి, వీడియో కౌన్సిలింగ్ నిర్వహించారు.గతంలో సిజేరియన్ అయినందున, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఉదయం 7:15 గంటలకు అత్యవసర శస్త్రచికిత్స ద్వారా మృత శిశువును బయటకు తీశారు. తల్లి ఆరోగ్యం ప్రస్తుతం సురక్షితంగా ఉంది.శిశువు మరణాన్ని ఊహించని, కారణం తెలియని గర్భస్థ శిశు మరణం (Unexplained Stillbirth)గా సూపరింటెండెంట్ తన నివేదికలో నిర్ధారించారు.




