Nalgonda: పారదర్శక ఓటరు జాబితా తయారీయే లక్ష్యం కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సమావేశం. జిల్లాలో 99.95 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడి.

Saleem, Nalgonda
Published on: 7 Aug 2026 4:56 PM IST
Nalgonda
X

Nalgonda: పారదర్శక ఓటరు జాబితా తయారీయే లక్ష్యం కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా జిల్లాలో పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే తమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 99.95 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ వివరాలను ఈ సందర్భంగా వివరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story