Nalgonda: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి: నల్లగొండ కలెక్టర్!

Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడపత్రికను కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆవిష్కరించారు.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 10:05 PM IST
Nalgonda
X

Nalgonda: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి: నల్లగొండ కలెక్టర్!

నల్లగొండ: బ్యాంకు లావాదేవీలు, పథకాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'ఆర్థిక అక్షరాస్యత' అవగాహన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిపాజిట్లు, నగదు ఉపసంహరణ, రుణాల మంజూరు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల రుణ వివరాలను అక్షరాస్యత కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటిలోని ప్రతినిధులు గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story