Nalgonda: నల్లగొండ జిల్లాలో 57.70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం!
Nalgonda: నల్లగొండ మండలం గుండ్లపల్లిలో వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆదేశించారు.
Nalgonda: నల్లగొండ జిల్లాలో 57.70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం!
Nalgonda: నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, గుండ్లపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రహదారికిరువైపులా 800 మొక్కలు నాటగా, ఈ కార్యక్రమానికి కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..వనమహోత్సవం కింద జిల్లాలో ఈ సంవత్సరం 57 లక్షల 70000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇప్పటివరకు దాదాపు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశామని,తక్కిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మంగళవారం వనమహోత్సవం కింద రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ,ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలలో మొక్కలు నాటడం జరుగుతున్నదని, అన్ని ప్రభుత్వ సంస్థలు,ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, స్థలం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడ తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని మొక్కలు నాటాలని, జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని,అవసరమైతే విబిజీరామ్ జీ కింద వాచర్ ను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలకు నీరు అందించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించుకోవాలని చెప్పారు.గ్రామ సర్పంచ్ వి. రమేష్,డి ఎఫ్ ఓ రాజశేఖర్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి , జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్,ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉపసర్పంచ్ జే .కే .సతీష్,మాజీ జెడ్పిటిసిలు, గుమ్మల మోహన్ రెడ్డి ,వంగురు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, ఎంపీడీవో యాకూబ్, తదితరులు ఉన్నారు.




