Marriguda: శివన్నగూడెం ముంపు బాధితులకు అండగా ఉంటాం..కలెక్టర్ చంద్రశేఖర్!

Marriguda: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ ముంపు బాధితుల ఇళ్లను పరిశీలించి, పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Saleem, Nalgonda
Published on: 29 July 2026 10:33 PM IST
Marriguda
X

Marriguda: శివన్నగూడెం ముంపు బాధితులకు అండగా ఉంటాం..కలెక్టర్ చంద్రశేఖర్!

మర్రిగూడ:​ మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురైన నర్సిరెడ్డిగూడెం బాధితులకు ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందిస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలో ముంపు బాధితులు సొంతంగా నిర్మించుకున్న గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా అధికారులు వివరాలు వెల్లడిస్తూ... రిజర్వాయర్ ముంపునకు గురైన మొత్తం 287 కుటుంబాలకు చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించగా, అందులో 54 కుటుంబాల వారు శివన్నగూడెం వద్ద ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్‌లో సొంత నిధులతో ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story