Nalgonda: కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాఖీలు కట్టిన అనాథాశ్రమ బాలికలు!

Nalgonda: రక్షాబంధన్ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు పాన్‌గల్ చారుమతి అనాథాశ్రమ బాలికలు రాఖీలు కట్టారు.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 8:41 PM IST
Nalgonda
X

Nalgonda: కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాఖీలు కట్టిన అనాథాశ్రమ బాలికలు!

నల్గొండ: అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల ప్రేమానురాగాలకు, ఆత్మీయ అనుబంధానికి రక్షాబంధన్ పండుగ నిదర్శనమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి సోదరుడు కలకాలం రక్షణగా, తోడుగా ఉంటాననే కొండంత భరోసాను ఈ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు.

​శుక్రవారం కలెక్టరేట్‌లో పాన్గల్‌లోని చారుమతి అనాథాశ్రమానికి చెందిన బాలికలు కలెక్టర్‌ను కలసి ఆప్యాయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన స్వీట్లు తినిపించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు అందజేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story