Nalgonda: మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలి
Nalgonda: నల్గొండలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10,000 వేతనం ఇవ్వాలని డిఈవోకు వినతిపత్రం సమర్పించిన సీఐటీయూ నాయకులు దండంపల్లి సత్తయ్య, పోలే సత్యనారాయణ.
Nalgonda: మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లించాలి
నల్లగొండ: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల హామీ ప్రకారం రూ.10,000 వేతనం చెల్లించాలని మరియు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ (CITU) జిల్లా నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
బుధవారం నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) శ్రీనివాసరావును కలిసి, కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు.




