Nalgonda: ఆగస్టు 10న ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి సీఐటీయూ
Nalgonda: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం. జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీమ్ పిలుపు.
Nalgonda: ఆగస్టు 10న ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి సీఐటీయూ
నల్గొండ: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపట్టే ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీమ్ పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్లగొండలోని సిఐటియు కార్యాలయంలో సల్వోజు సైదాచారి అధ్యక్షతన జరిగిన పట్టణ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story




