Nalgonda: రాఖీ వేళ నల్లగొండ బస్టాండ్‌లో ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
Nalgonda: రాఖీ పౌర్ణమి వేళ నల్లగొండ ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపకపోవడంపై ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు.
Nalgonda: రాఖీ వేళ నల్లగొండ బస్టాండ్‌లో ప్రయాణికుల తీవ్ర అవస్థలు!
నల్గొండ: రాఖీ పౌర్ణమి వేడుకల వేళ ఆర్టీసీ అధికారుల అనాలోచిత వైఖరి ప్రయాణికులకు శాపంగా మారింది. పండుగను పురస్కరించుకుని పుట్టింటికి వెళ్లే ఆడపడుచులు, విద్యార్థులు, ఉద్యోగులతో గురువారం నల్లగొండ ప్రధాన బస్టాండ్ కిక్కిరిసిపోయింది. రద్దీకి తగ్గట్లుగా ప్రత్యేక సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
ముఖ్యంగా నల్లగొండ–మాచర్ల మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియక పసిపిల్లలతో మహిళలు, వృద్ధులు అల్లాడిపోయారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆర్టీసీ యంత్రాంగం చేతులెత్తేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రద్దీగా ఉన్న మార్గాల్లో తక్షణమే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.




