Nalgonda: జీవో 97ను వెంటనే రద్దు చేయాలి – బీసీ సంక్షేమ సంఘం
Nalgonda: జీవో 97తో పాలిటెక్నిక్ విద్య వ్యవస్థ నాశనమవుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఆరోపణ.
Nalgonda: జీవో 97ను వెంటనే రద్దు చేయాలి – బీసీ సంక్షేమ సంఘం
నల్గొండ: ప్రభుత్వం తీసుకొచ్చిన G.O 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు అధ్యాపకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ అన్నారు G.O 97 రద్దు చేయాలని కొంత కాలం నుండి విద్యార్థులు ధర్నాలు చేస్తున్న నిరసనలు తెలుపుకున్న ప్రభుత్వం స్పందించకపోవడం సభకు కాదన్నారు యంగ్ ఇండియా స్కూల్ బలోపేతం పేరుతో పాలిటెక్నిక్ విద్య వ్యవస్థ ఆగం అవుతుందని విద్యార్థుల ఆవేదన చెబుతున్నారన్నారు.
అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీకే స్కిల్ ఉందని ప్రశ్నించారు యూనివర్సిటీలో వందల మంది ఉండాల్సిన స్టాఫ్ లో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు కాబట్టి 97 G.O ను రద్దు చేసి పాత విధానంలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు వడ్డబోయిన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




