Nakrekal: నకిరేకల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య అత్యంత దుర్మార్గం
Nakrekal: కొండ మల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన నకిరేకల్ మండల TRSMA. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్.
Nakrekal: నకిరేకల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య అత్యంత దుర్మార్గం
నకిరేకల్: నకిరేకల్ మండల ట్రస్మా శాఖ పక్షాన, నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ కొండ మల్లేపల్లి ప్రిన్సిపాల్ శ్రీ రూపారెడ్డి గారిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం అత్యంత ఖండనీయమైన, దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఈ సంఘటన మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
నకిరేకల్ మండల ట్రస్మా తరఫున, మరణించిన శ్రీ రూపారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఇటీవలి కాలంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యతో సమానంగా అభివృద్ధి చెందుతూ, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సమాజానికి సేవలు అందిస్తున్న పాఠశాలలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారాయి. ఈ తరహా దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఈ హత్యకు పాల్పడిన దుండగులను పోలీసు శాఖ తక్షణమే గుర్తించి, అరెస్ట్ చేసి, వారికి తగిన కఠిన శిక్షలు విధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో ట్రస్మా ఉపాధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, శ్రీమతి సరితారెడ్డి గారు, సహాయ కార్యదర్శి శ్రీ శంకర్ గారు, కోశాధికారి శ్రీ కృష్ణ గారు, గంగరాజు గారు, శ్రీ సుదాకర్ గారు, సురేష్ గారు, నాగేశ్వర రావు గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్రీ శంభులింగారెడ్డి గారు మాట్లాడుతూ, మరణించిన వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భవిష్యత్తులో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందించేందుకు నకిరేకల్ మండల ట్రస్మా శాఖ ముందుంటుందని తెలిపారు.




