Nadigudem: నడిగూడెంలో బీఆర్ఎస్ ధర్నా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి

Nadigudem: నడిగూడెం సబ్‌స్టేషన్ వద్ద నిరంతరాయ విద్యుత్ కోసం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 23 July 2026 2:58 PM IST
Nadigudem
X

Nadigudem: నడిగూడెంలో బీఆర్ఎస్ ధర్నా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి

నడిగూడెం: రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గురువారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అంతకుముందు నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే స్థానిక విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, నియోజకవర్గంలో రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు,కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లయ్య యాదవ్ విమర్శించారు. పొలాల్లో బోర్లకు సరిపడా విద్యుత్ అందక, సరైన సాగునీరు లేక పంటలు కళ్ళ ముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కాళేశ్వరం–కన్నెపల్లి నుంచి సాగునీటిని విడుదల చేయాలని, రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story