Nalgonda: మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
Nalgonda: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా రక్షాబంధన్. సోదరీమణుల రాఖీ ధారణ, రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు.
Nalgonda: మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
Nalgonda: అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.
తన నలుగురు సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. తన అక్కల కుటుంభ సభ్యులతో సంప్రదాయబద్దంగా జరుపుకున్న రాఖి పండుగలో తన మనుమరాలు వాన్య తో పాటు కలిసి రాఖీ కట్టించుకున్నారు.
అనంతరం మునుగోడు నియోజకవర్గం తో పాటు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వదించారు...
కుటుంబ వ్యవస్థకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగని, సోదరులు తమ సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని, సోదరీమణులు తమ కుటుంబాల్లో ప్రేమానురాగాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.
ఈ రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకాంక్షిస్తూ... మునుగోడు నియోజకవర్గం తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.




