Nalgonda: ప్రజా పాలన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ చామల!
Nalgonda: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా పాలన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
Nalgonda: ప్రజా పాలన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ చామల!
నల్గొండ: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వెయ్యి రోజుల ప్రజా పాలన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల కార్యక్రమాలకు ధీటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్ష నేత పదవినీ దుర్వినియోగం చేశారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్, తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్, వెయ్యి రోజులుగా ఒక్క రోజు కూడా అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా ఆ పదవిని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత పదవి నుంచి దిగిపోయి, దళిత ఎమ్మెల్యేకు ఆ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడికి ఆ పదవి ఇస్తేనే కాంగ్రెస్ పాలనపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు ఉంటుందని స్పష్టం చేశారు.




