Suryapet: మోతెలో కలకలం: వ్యవసాయ భూమిలో దంపతుల మృతదేహాలు లభ్యం!
Suryapet: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో దారుణం జరిగింది. పొలంలో పాక్షికంగా పాతిపెట్టిన స్థితిలో భార్యాభర్తల మృతదేహాలు లభించాయి.
Suryapet: మోతెలో కలకలం: వ్యవసాయ భూమిలో దంపతుల మృతదేహాలు లభ్యం!
సూర్యాపేట: మోతె మండల కేంద్రం సమీపంలోని వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో భార్య, భర్త మృతదేహాలు లభించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జాతీయ రహదారి వెంబడి ఉన్న ఓ పొలంలో కాళ్లు, చేతులు మాత్రమే బయట కనిపించేలా మగ, ఆడ మృతదేహాలను ఎవరో పాక్షికంగా పాతిపెట్టినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణ రెడ్డి, స్థానిక ఎస్ఐ, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ పరిశీలించారు. ప్రాథమిక విచారణలో మృతులు మోతె మండలం బీక్యాతండాకు చెందిన బూబా, నాగుగా గుర్తించారు. ఈ మేరకు మోతె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, "ఎవరైనా కొట్టి చంపి మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్నాం. సంఘటనకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. పోలీసులు మరింత ఆధారాల కోసం క్లూస్ టీంతో పాటు ఫోరెన్సిక్ బృందంతో విచారణ కొనసాగిస్తున్నారు.




