Suryapet: మోదీ పాలనలో సంక్షేమానికి తూట్లు: ఏఐటీయూసీ నేత జడ శ్రీనివాస్

Suryapet: మోదీ పాలనలో ప్రజా సంక్షేమానికి ఆటంకం కలుగుతోందని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 15 Sept 2026 6:03 PM IST
Suryapet
X

Suryapet: మోదీ పాలనలో సంక్షేమానికి తూట్లు: ఏఐటీయూసీ నేత జడ శ్రీనివాస్

Suryapet: పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశం గోవిందపురంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పాలన ప్రజా సంక్షేమానికి ఆటంకం కలుగుతుంది అన్నారు.

సంక్షేమానికి తూట్లు పొడిచి శ్రామికుల శ్రమను అమ్ముకుంటున్న నరేంద్ర మోడీ స్వతంత్రానికి పూర్వమే సాధించుకున్న కార్మిక హక్కులను హరించే ప్రయత్నం లో ఉన్నారని నరేంద్ర మోడీ విధానాలని వ్యతిరేకించాలని దేశ జనాభాలో సగానికి పైగా కార్మిక వర్గం ఉన్నదని ఆ కార్మిక వర్గానికి చేయాల్సింది చేయకపోగా ఉన్న హక్కులను తీసివేస్తూ కార్పోరేట్ పెట్టుబడిదారీ శక్తులకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపించారు.

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కదం తొక్కుతుందని ఆ గాలిలో నరేంద్ర మోడీ కొట్టుకొని పోవడం ఖాయం అని ఆయన అన్నారు. దేశంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లొ పనిచేస్తున్న కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని కార్మికులకు కనీస వేతనం నెలకు 26000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర ఇవ్వాలని అన్నారు.

భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలని ఇప్పుడు ఉన్న ప్రమాద బీమా10 లక్షలు బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు తెలిపారు. ఈ సందర్భంగా 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఇందిరాల వెంకటేశ్వర్లు, భవనిర్మాణ కార్మిక సంగం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టి ప్రసాద్, మండల నాయకులు ముడుసు పాపారావు, పట్టణ అధ్యక్షుడు తాటికొండ జయరాజు, ఎల్ అనిల్, బొప్పన రాజు, బండి భాస్కర్, ఇట్టి మల్ల మట్టయ్య, రెంటల రమేషు, మరుసకట్ల దాసు, రెంటల నరసింహారావు, తెలగమల్ల మధు, తోకల ప్రభాకర్, ధూళిపాల నరి, v వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR