Nakrekal: పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే వేముల వీరేశం!

Nakrekal: నకిరేకల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.

Saleem, Nalgonda
Published on: 18 Aug 2026 12:41 PM IST
Nakrekal
X

Nakrekal: పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే వేముల వీరేశం!

Nakrekal: బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.

పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ ధైర్యసాహసాలతో సమాజంలోని నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే నేటి తరం నడవాల్సిన అవసరం ఉందన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story