Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
Nakrekal: నకిరేకల్ 17వ వార్డులో 'ఇందిరా మహిళా శక్తి' చీరలను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
నకిరేకల్‌లో: ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. స్థానిక నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు మహిళలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 'ఇందిరా మహిళా శక్తి' చీరలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Next Story




