Nakrekal: మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' ఉత్సవాలు!
Nakrekal: నకిరేకల్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం 'ఇందిరా మహిళా శక్తి' కార్యక్రమంలో భాగంగా 5, 6 వార్డుల మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
Nakrekal: మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' ఉత్సవాలు!
నకిరేకల్: మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6 వార్డులకు చెందిన మహిళలకు ఆయన చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, మహిళలకు గౌరవప్రదంగా చీరలు అందజేయడం సంతోషకరమని పేర్కొన్నారు. కాగా, చీరలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




