Nakrekal: నకిరేకల్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుల నియామకం ఎమ్మెల్యే వీరేశం

Nakrekal: నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం నియమించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 24 Jun 2026 8:14 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుల నియామకం ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్: నకిరేకల్ మండల అధ్యక్షులుగా గాదగోని కొండయ్య , టౌన్ అధ్యక్షులుగా లింగాల వెంకన్న , కేతేపల్లి మండల అధ్యక్షులుగా ఎడ్ల ప్రవీణ్ గారు , కట్టంగూర్ మండల అధ్యక్షులుగా సుంకరబోయిన వెంకన్న , నార్కట్‌పల్లి మండల అధ్యక్షులుగా గాయం శ్యామ్ సుందర్ రెడ్డి , చిట్యాల మండల అధ్యక్షులుగా జడల చిన్న మల్లయ్య , చిట్యాల టౌన్ అధ్యక్షులుగా ఎద్దులపూరి కృష్ణ నియమించటం జరిగింది. ఈ నియామక పత్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత వారికి అందజేశారు.

పార్టీ బలోపేతానికి సీనియర్ల సలహాలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన సీనియర్ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి మండలం, ప్రతి పట్టణంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఓట్ల సవరణపై ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతోందని, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు అనేది ప్రజల మౌలిక హక్కు అని పేర్కొంటూ, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే కార్యకర్తలను తప్పకుండా గుర్తించి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలపై వేలాది అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story