Miryalaguda: 25 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిఎస్పీ రవి

Miryalaguda: మిర్యాలగూడ జ్యువెలరీ అసోసియేషన్ రూ. 3.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను డిఎస్పీ రవి, సిఐ నాగభూషణరావు ప్రారంభించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 24 Aug 2026 8:02 PM IST
Miryalaguda
X

Miryalaguda: 25 సీసీ కెమెరాలను ప్రారంభించిన డిఎస్పీ రవి

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ జ్యువెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.3,50,000/- వ్యయంతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను మిర్యాలగూడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవి మరియు మిర్యాలగూడ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణరావు ప్రారంభించారు.

పట్టణంలోని జ్యువెలరీ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడం, దొంగతనాలు, నేరాలను అరికట్టడం, అలాగే నేరాలకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పట్టణంలో ప్రజల భద్రతకు, ముఖ్యంగా వ్యాపార సంస్థల రక్షణకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని పోలీసు అధికారులు తెలిపారు.

జ్యువెలరీ అసోసియేషన్ వారు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ పట్టణ భద్రతకు సహకరిస్తున్నందుకు పోలీసు అధికారులు అభినందించారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story