Miryalaguda: మంత్రి వివేక్ పర్యటన.. కోడిరెక్క శౌరికి ఘన నివాళి

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 May 2026 12:14 PM IST
Miryalaguda
X

Miryalaguda: మంత్రి వివేక్ పర్యటన.. కోడిరెక్క శౌరికి ఘన నివాళి

మిర్యాలగూడ: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటన. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడి రెక్క శౌరి అంత్యక్రియలో పాల్గొని ఘనంగా నివాళులు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన మంత్రి వివేక్. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం. మంత్రితో పాటు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మంత్రి కామెంట్స్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు సకాలంలో అందించి పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం.

లబ్ధిదారులకు పేమెంట్లు సకాలంలో అందజేస్తున్నాం. జూన్ 2 నుండి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. రెండు లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం. మిర్యాలగూడ,నకిరేకల్ లలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు..త్వరలో పనులు ప్రారంభం. దేశంలోనే టాo కామ్ కు 90 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి. టాo కామ్ లో నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీ పై నైపుణ్యం,ఉపాధి కల్పించడమే లక్ష్యం.

జర్మనీలో ఐదు లక్షల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అందుకే టాం కామ్ సంస్థ ద్వారా జర్మనీ భాషలో కూడా నైపుణ్యం సాధించేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీని నియమిస్తున్నాం. పరిశ్రమలో కార్మికుల రక్షణ కోసం ఆయా ఫ్యాక్టరీలో చేసిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ముఖ్యంగా ఫార్మా రంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధివిధానాల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటాం.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story