Suryapet: లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్‌గా మీలా మహదేవ్ ఏకగ్రీవ ఎన్నిక!
Suryapet: సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ నూతన చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
Suryapet: లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్‌గా మీలా మహదేవ్ ఏకగ్రీవ ఎన్నిక!
Suryapet: సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ నూతన చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సోమవారం లయన్స్ ఐ హాస్పిటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ గారు హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లయన్స్ ఐ హాస్పిటల్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యదర్శిగా పెండెం చంద్రశేఖర్, కోశాధికారిగా చిలుముల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా ఈగ దయాకర్ గుప్త ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా, భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మీకాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేష్ రెడ్డి, పటేల్ నర్సింహా రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ధర్మారావు ఎన్నికయ్యారు.గౌరవ సలహాదారులుగా గుణగంటి రాములు, మొరిశెట్టి లక్షాది, గుడిపూడి వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.




