Suryapet: సూర్యాపేటలో ఘోరం.. భూమి కోసం అక్కను కత్తితో నరికి చంపిన తమ్ముడు!

Suryapet: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మలపెనపహాడ్‌లో భూ వివాదం కారణంగా అక్కను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు సైదులు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 18 May 2026 1:12 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘోరం.. భూమి కోసం అక్కను కత్తితో నరికి చంపిన తమ్ముడు!

సూర్యాపేట: ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మలపెనపహాడ్‌లో భూ వివాదం హత్యకు దారితీసిన ఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ నరసింహ సందర్శించి పరిశీలించారు. భూమి విషయంలో గొడవపడి సొంత అక్కపై తమ్ముడు సైదులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.

ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలోనే ఈ విషయంలో ఇరు వర్గాలను పోలీసులు బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. భూ తగాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని, హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు, జైలు శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన ఆయన, ప్రజలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ రాజశేఖర్, క్లూస్ ఇన్స్పెక్టర్ నవీన్ ఉన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story