Mahatma Gandhi University: ఎంజీయూలో ఘనంగా క్రీడా పోటీల ప్రారంభం
Mahatma Gandhi University: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు.
Mahatma Gandhi University: ఎంజీయూలో ఘనంగా క్రీడా పోటీల ప్రారంభం
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఆటలను ప్రారంభించి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు.
విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




