Maddirala: మద్దిరాల తహసీల్దార్ కార్యాలయ నిర్మాణంపై వివాదం.. స్థానికుల నిరసన!

Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాల తహసీల్దార్ కార్యాలయాన్ని గోరంట్ల శివారుకు మార్చాలనే ప్రతిపాదనపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 19 Aug 2026 4:48 PM IST
Maddirala
X

Maddirala: మద్దిరాల తహసీల్దార్ కార్యాలయ నిర్మాణంపై వివాదం.. స్థానికుల నిరసన!

మద్దిరాల: ​సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మద్దిరాల మండల పరిపాలనా భవన నిర్మాణం వివాదాస్పదమైంది.ఎంఆర్వో కార్యాలయాన్ని మద్దిరాల పరిధిలో కాకుండా గోరంట్ల శివారుకు మార్చాలనే ప్రయత్నాలపై స్థానికులు, ప్రజాసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.

​గోరంట్లకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వ్యాపార ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఉచిత స్థలమనే ముసుగుతో ఈ కుట్రకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. మద్దిరాల ఎక్స్ రోడ్డు వద్ద దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని విస్మరించి వేరే ప్రాంతాన్ని ఎంపిక చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని మండిపడుతున్నారు.

​ప్రజా సౌకర్యాన్ని గాలికి వదిలేసి, వ్యక్తిగత లాభాల కోసం నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గోరంట్ల ప్రతిపాదనను విరమించుకోవాలని, మద్దిరాల పరిధిలోని ప్రభుత్వ భూమిలోనే తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story