Suryapet: సూర్యాపేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు!

Suryapet: సూర్యాపేటలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 6 July 2026 10:14 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు!

సూర్యాపేట: దేశ మాజీ ఉప ప్రధాని, దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఘనంగా నివాళులర్పించారు.

కొత్త బస్టాండ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, చిన్న వయసులోనే వివక్షను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివిన బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలోని అన్ని శాఖలకు మంత్రిగా పనిచేసి, క్లిష్ట సమయంలో ఉప ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు.

రెండు కుండల విధానం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత ఆయనదే అన్నారు. "మహానుభావుల ఆశయాలను సాధించడమే మనం వారికి ఇచ్చే అతి పెద్ద నివాళి" అని పేర్కొన్నారు.

మహానుభావులు చూపిన బాటలో నడవాలని, దళితులకు ఎలాంటి సమస్య వచ్చినా అందరం ఏకమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న, ఎం.ఎస్.ఎఫ్ రాష్ట్ర నాయకులు బొజ్జ సైదులు, దళిత సంఘాల నాయకులు బొల్లెద్దు వినయ్, వల్లపట్ల దయానంద్, మల్లేష్, ఉపేందర్, వెంకటయ్య, తన్నీరు వాసు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story