Nalgonda: మర్రిగూడ జంక్షన్ వద్ద అత్యాధునిక ఫ్లైఓవర్ అందుబాటులోకి!
Nalgonda: రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించిన మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి, నార్కట్‌పల్లి-అద్దంకి హైవే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టారు.
Nalgonda: మర్రిగూడ జంక్షన్ వద్ద అత్యాధునిక ఫ్లైఓవర్ అందుబాటులోకి!
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో ₹60 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు.
ఫ్లైఓవర్ ప్రారంభంతో పట్టణ వాసులతో పాటు నిత్యం ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




