Kanchanapalli: వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతలపూర్తి కోమటిరెడ్డి
Kanchanapalli: వచ్చే దసరాకి కంచనపల్లి ఎత్తిపోతల, సబ్‌స్టేషన్ పూర్తి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం.
Kanchanapalli: వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతలపూర్తి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా:
వచ్చే దసరా నాటికి కంచనపల్లి ఎత్తిపోతల పూర్తి
వచ్చే దసరా పండుగ నాటికి నల్గొండ మండలం కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు 33/11 సబ్‌స్టేషన్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కంచనపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, కంచనపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. పండుగ కానుకగా గ్రామంలోని ఆడబిడ్డలందరికీ తన సొంత నిధులతో పట్టుచీరలు ఇస్తానని ప్రకటించారు.
Next Story




