Kodada: కోదాడలో పోలీసుల 'ఆపరేషన్ అడ్డా'.. అర్ధరాత్రి తిరిగితే కఠిన చర్యలు!

Kodada: కోదాడ పట్టణంలో అర్ధరాత్రి పోలీసులు 'ఆపరేషన్ అడ్డా' పేరిట ఆకస్మిక తనిఖీలు. యువకులకు కౌన్సిలింగ్, సీఐ శివ శంకర్ కీలక హెచ్చరికలు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 4 July 2026 7:41 PM IST
Kodada
X

Kodada: కోదాడలో పోలీసుల 'ఆపరేషన్ అడ్డా'.. అర్ధరాత్రి తిరిగితే కఠిన చర్యలు!

​కోదాడ: ​కోదాడ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా కోదాడ టౌన్ పోలీసులు "ఆపరేషన్ అడ్డా" పేరుతో నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ​రాత్రి 11 గంటల తర్వాత ఎటువంటి కారణం లేకుండా రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిబంధనలను అతిక్రమించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం, అదుపులోకి తీసుకున్న యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.​ఈ సందర్భంగా కోదాడ టౌన్ సీఐ శివ శంకర్ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ ధ్యేయమని, రాత్రిపూట అనవసరంగా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముఖ్యంగా, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story