Kodada: కోదాడలో ఇద్దరు బీహార్ కూలీల అనుమానాస్పద మృతి!
Kodada: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర ఉదంతం వెలుగుచూసింది.
Kodada: కోదాడలో ఇద్దరు బీహార్ కూలీల అనుమానాస్పద మృతి!
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ (22), శివాజీ (21)గా గుర్తించారు. వీరు కోదాడ పరిసరాల్లోని ఒక రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. మృతదేహాల పక్కనే వారి దుస్తులు, ద్విచక్ర వాహనం పడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




