Kodad: దొరకుంట వద్ద ఆర్కే మేజర్ కాలువకు గండి ఉద్రిక్తత!
Kodad: కోదాడ దొరకుంట వద్ద ఆర్కే మేజర్ కాలువకు గండి పెట్టడంతో ఉద్రిక్తత. కాలువకు గండిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన దిగువ ప్రాంతాల రైతులు.
Kodad: దొరకుంట వద్ద ఆర్కే మేజర్ కాలువకు గండి ఉద్రిక్తత!
Kodad: కోదాడ మండలం దొరకుంట గ్రామం వద్ద NSP ముక్యాల కెనాల్ బ్రాంచ్ కాలువ నుంచి ప్రారంభమయ్యే ఆర్కే మేజర్ కాలువకు గండి పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామ చెరువును నింపుకునేందుకు దొరకుంట గ్రామస్తులు కాలువకు గండి పెట్టినట్లు స్థానికులు తెలిపారు.
కాలువకు గండి పెట్టడంతో దిగువన ఉన్న నల్లబండగూడెం, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గండి ప్రదేశానికి చేరుకున్న రెండు గ్రామాల ప్రజలు దొరకుంట గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువకు గండి ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇదే కాలువకు ఐదు రోజుల క్రితం కాపుగల్లు రైతులు సైతం గండి కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు.
ఇలా గ్రామాల వారీగా పోటీ పడి కాలువకు గండ్లు పెడితే దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువకు ఇష్టారాజ్యంగా గండ్లు పెడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నల్లబండగూడెం, రెడ్లకుంట గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. కాలువల పరిరక్షణతో పాటు నీటిని నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని కోరారు.




