Kodad: శబ్ద కాలుష్యానికి చెక్. రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం చేసిన ఎస్పీ

Kodad: కోదాడలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ హెవీ సైలెన్సర్లను పోలీసులు రోలర్‌తో తొలగించి ధ్వంసం చేశారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 21 July 2026 1:40 PM IST
Kodad
X

Kodad: శబ్ద కాలుష్యానికి చెక్. రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం చేసిన ఎస్పీ

కోదాడలో శబ్ద కాలుష్యానికి చెక్.. రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం.....

కోదాడ Hmtv : పట్టణంలో బైక్‌లపై ఆకతాయిల పోకడలు, నిబంధనలు ఉల్లంఘించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నర్సింహ స్వయంగా హాజరై మాట్లాడారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సీఐ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.

పట్టణంలో టూ వీలర్ బైక్స్‌కు కృత్రిమంగా పెద్ద శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్న హెవీ సైలెన్సర్లను పోలీసులు తొలగించారు. మోటార్ వెహికల్ యాక్ట్ (ఎంవీ యాక్ట్) సెక్షన్ 190 ప్రకారం వీటిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగానే సీజ్ చేసిన ఆ సైలెన్సర్లను కోదాడ రంగా థియేటర్ సెంటర్‌లో రోలర్‌తో తొక్కించి ప్రజల సమక్షంలో పూర్తిగా ధ్వంసం చేసి ప్రజలకు అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ బైక్ హెవీ సైలెన్సర్స్ తో వచ్చే శబ్దంతో పాటు ఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలకు భారీ సౌండ్ బాక్సులు పెట్టి శబ్దాలు చేయడం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.

వాహనాల నుంచి వచ్చే శబ్దం 85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ ఉండకూడదని స్పష్టం చేశారు. పట్టణంలో ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ నివారణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం త్వరలో 'మై ఆటో సేఫ్' పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story