Kodad: సూర్యాపేట-కోదాడ మీదుగానే బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండాలి

Kodad: హైదరాబాద్–అమరావతి–చెన్నై బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను సూర్యాపేట, కోదాడ మీదుగానే ఉంచాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 24 Aug 2026 4:16 PM IST
Kodad
X

Kodad: సూర్యాపేట-కోదాడ మీదుగానే బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండాలి

కోదాడ: ​హైదరాబాద్–అమరావతి–చెన్నై నగరాలను అనుసంధానించే ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను మార్చకుండా, గతంలో ప్రతిపాదించిన విధంగానే సూర్యాపేట–కోదాడ మీదుగా రైలుమార్గాన్ని ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

​కోదాడ పట్టణ పరిధిలోని పబ్లిక్ క్లబ్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై తమ మద్దతు తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న అలైన్‌మెంట్ మార్పుల వల్ల కోదాడ ప్రాంతానికి నష్టం జరిగే అవకాశం ఉందని, పాత ప్రతిపాదిత మార్గంలోనే రైలు నడపాలని కోరారు. రాబోయే తరాల విద్య, ఉపాధి, పారిశ్రామిక మరియు ఆర్థిక అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

కోదాడలో జనసాంద్రత పెరుగుతుండటంతో పాటు సిమెంట్ పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు, విద్యాసంస్థలు విస్తరిస్తున్నాయని తెలిపారు. కోదాడకు హైస్పీడ్ రైలు సాధించే దిశగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని పిలుపునిచ్చారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story