Kethepally: కేతేపల్లి వద్ద తప్పిన భారీ ప్రమాదం ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి!
Kethepally: నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన భారీ ప్రమాదం. డివైడర్‌పైకి మళ్లించడంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.
Kethepally: కేతేపల్లి వద్ద తప్పిన భారీ ప్రమాదం ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి!
Kethepally: నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద సోమవారం ఉదయం తృప్తిలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన చేపల లోడు టాటా ఏసీ వాహనం బలంగా ఢీకొట్టింది.
అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ముందున్న వాహనాలను తప్పించే క్రమంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి, బస్సును డివైడర్‌పైకి మళ్లించారు. దీంతో బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో తీవ్ర ప్రమాదం నివారింపబడింది.
ఈ ఘటనతో జాతీయ రహదారిపై బస్సు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.




