Kethepally: కేతేపల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Kethepally: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 20 Aug 2026 12:35 PM IST
Kethepally
X

Kethepally: కేతేపల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Kethepally: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కేతేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా రాజకీయాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచిన చారిత్రాత్మక నిర్ణయం రాజీవ్ గాంధీ గారిదేనని కొనియాడారు.ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కంచర్ల మహేందర్ రెడ్డి, సర్పంచులు బీరం జాన్ రెడ్డి, కోట పూర్ణచంద్రరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు భయ ముత్తయ్య, అయితేగోని వెంకట్, వీరాచారి నాగయ్య, చింత ఆంద్రయ్య, భయ్యా గణేష్, అనుముల అంజి, పోతుగంటి బాలు, కుమ్మరి లింగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story