Nalgonda: కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు: జూలకంటి రంగారెడ్డి!
Nalgonda: అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
Nalgonda: కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు: జూలకంటి రంగారెడ్డి!
నల్లగొండ: నవంబరు నెలలో నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కిసాన్ సభ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నల్లగొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంటలకు మద్దతు ధర కల్పించేందుకు చట్టం చేయకపోగా, విద్యుత్ సంస్కరణల పేరుతో ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, రైతులను స్వంత భూముల్లోనే కూలీలుగా మార్చే యత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు.




