Nalgonda: తెలంగాణ నీటి హక్కులపై సర్కార్ నిర్లక్ష్యం: జగదీష్ రెడ్డి ధ్వజం
Nalgonda: శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, వెంటనే పంటలకు సాగునీటి షెడ్యూల్ ప్రకటించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Nalgonda: తెలంగాణ నీటి హక్కులపై సర్కార్ నిర్లక్ష్యం: జగదీష్ రెడ్డి ధ్వజం
Nalgonda: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఉదయ సముద్రం ఎండిపోతున్నా స్థానిక మంత్రి పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. సాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ ఆయకట్టుకు వెంటనే మొదటి పంట కోసం నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.




