Nalgonda: దేశ సమైక్యతకు ఇస్కాఫ్ కృషి అభినందనీయం: కడారు ప్రభాకర్ రావు

Nalgonda: నల్గొండలో జరిగిన ఇస్కాఫ్ జిల్లా మహాసభల్లో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కడారు ప్రభాకర్ రావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద ఆధిపత్యంపై గళమెత్తారు.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 7:19 PM IST
Nalgonda
X

Nalgonda: దేశ సమైక్యతకు ఇస్కాఫ్ కృషి అభినందనీయం: కడారు ప్రభాకర్ రావు

Nalgonda: భారతీయ సంస్కృతి, కళలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రతల రక్షణకు భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కాఫ్) గత 80 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తోందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కడారు ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని ఐఎంఏ హాల్‌ లో డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు అధ్యక్షతన నిర్వహించిన ‘ఇస్కాఫ్ జిల్లా మహాసభల’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

​అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), ప్రపంచ బ్యాంకుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యాన్ని ప్రశ్నించడాన్ని ఈ సందర్భంగా స్వాగతించారు. వెనిజులా అధ్యక్షుడు మడురోను అమెరికా సైన్యం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda