Suryapet: హుజూర్నగర్లో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన!
Suryapet: హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రి ఎదుట నివాస ప్రాంతంలో చేపట్టిన ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని స్థానికులు ఆందోళన చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Suryapet: హుజూర్నగర్లో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన!
Suryapet: హుజూర్నగర్లో ఏరియా ఆసుపత్రి ఎదురుగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. టవర్ నిర్మాణం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్కు వినతిపత్రం అందజేశారు.
హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఏరియా ఆసుపత్రి, నివాస ప్రాంతానికి సమీపంలో టవర్ నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్కు స్థానికులు లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే నిర్మాణ పనుల గురించి సంబంధిత కాంట్రాక్టర్ను ప్రశ్నించగా, "మాకు అన్ని అనుమతులు ఉన్నాయి... పనులు ఆపేది లేదు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.




