Nalgonda: పిట్టంపల్లి ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు
Nalgonda: నల్గొండ జిల్లా పిట్టంపల్లి నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు. ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు.
Nalgonda: పిట్టంపల్లి ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి నోష్ ఫార్మా ల్యాబ్ లో భారీ పేలుడు. ఫార్మా కంపెనీలోని బ్లాక్-3 లో అకస్మాత్తుగా పేలిన రియాక్టర్. రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి. మృతుడు చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన బొడ్డు బాలకృష్ణ (30) గా గుర్తింపు.
ఎలిమినేడు విలేజ్‌లో నివాసం ఉంటూ 2016 నుంచి నోష్ ల్యాబ్‌లో పనిచేస్తున్న బాలకృష్ణ. ఈ ప్రమాదంలో మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి అత్యంత విషమం. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు.
సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్. పేలుడు ధాటికి చిందరవందరైన ప్లాంట్‌ను పరిశీలిస్తున్న అధికారులు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికుల ఆగ్రహం. మృతుడి కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్.




