Nalgonda: నల్లగొండలో ఉత్సాహంగా వినాయక చవితి షాపింగ్!

Nalgonda: నల్లగొండ రామగిరిలో వినాయక చవితి సందర్భంగా 21 రకాల పత్రికి భలే గిరాకీ ఏర్పడింది. పూజా సామాగ్రి కొనుగోలుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Saleem, Nalgonda
Published on: 14 Sept 2026 12:26 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఉత్సాహంగా వినాయక చవితి షాపింగ్!

​Nalgonda: వినాయక చవితి పండగను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. స్వామివారి పూజకు అత్యంత ప్రాధాన్యమైన 21 రకాల పత్రిని కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసముద్రంగా మారింది.

​వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ప్రత్యేకంగా తీసుకొచ్చిన పత్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పూజ సామగ్రి, వివిధ రకాల పూలు, పత్రి స్టాళ్లతో రామగిరి వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda